09-10-2025 12:37:02 AM
పెద్దపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి
పెద్దపల్లి, అక్టోబర్ 8 (విజయ క్రాంతి) ః తెలంగాణ రాష్ట్ర మద్యనిషేధ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2025- సంవత్సరాలకు రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయబడిందని పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు రూ. 3,00,000/- (నాన్ రిఫండబుల్) దరఖాస్తు రుసుముతో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్, పెద్దపల్లి వద్ద తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకునే వారికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని, ఒక్క వ్యక్తి ఎన్ని మద్యం దుకాణాల కైన వేసుకొనే అవకాశం కల్పించబడుతుందని, దరఖాస్తుతో మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, లేదా పాన్ కార్డు విద్యా ధ్రువీకరణలు, కుల ధృవీకరణ పత్రం లేదా సెల్ఫ్ డిక్లరేషన్ ధరకాస్తు (గౌడ/ఎస్.సి) కలిగి ఉండాలని తెలిపారు.
రెండేళ్ల కాలానికి లైసెన్స్లు 01-12-2025 నుంచి 30-11-2027 వరకు అమలులో ఉంటాయని, దరఖాస్తులు 26-09-2025 నుండి 18-10-2025 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించబడతాయని, మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి 15/11/2025 వరకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు కార్యాలయంలో అందించాలని, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం, ఎల్.ఐ.సి. భవనం ఎదురుగా, పెద్దపల్లి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
వివరాలకు అధికారిక వ్బుసైట్ https://tgbcl.telangana.gov.in/ts/index.php/site/login ను లేదా వివరాలకు డి.పి.ఈ.వో....8712658814,ఎస్.హెచ్.ఓ పెద్దపల్లి...8712658817,ఎస్.హెచ్.ఓ రామగుండం...8712658818,ఎస్.హెచ్.ఓ సుల్తానాబాద్...8712658819,ఎస్.హెచ్.ఓ మంథని...8712658820 నెంబర్లలో సంప్రదించాలని, కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనైనదని, అక్టోబర్ 18 తేదీలలోపు అప్లై చేయాలని, చివరి రోజు రద్దీ ఎక్కువగా ఉంటుందని, తమ దరఖాస్తులను నిర్ణీత గడువు లోగా సమర్పించగలరని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.