02-07-2025 07:34:04 PM
బహుజన సాహిత్య అకాడమీ సెలక్షన్ కమిటీ చైర్మన్ మందడి..
మణుగూరు (విజయక్రాంతి): అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏపీజే అబ్దుల్ కలాం, సేవరత్న, విద్యారత్న, ఉమెన్ లీడర్షిప్ అవార్డుల స్వీకరణ గాను, దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు బహుజన సాహిత్య అకాడమీ(Bahujana Sahitya Academy) సెలక్షన్ కమిటీ చైర్మన్ మందడి సంజీవరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డులను అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 600 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతున్నారని చెప్పారు.
ఒకరోజు పాటు నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ లో మార్నింగ్ సెక్షన్ లో సౌత్ ఇండియాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం చర్చిస్తారన్నారు. మధ్యాహ్నం అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా పూలే అంబేద్కర్ సిద్ధాంత భావజాలంతో పనిచేసే అగ్ర వర్ణాల వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సామాజిక ఉద్యమకారులు సంఘ సేవకులు, కవులు రచయితలు గాయకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. బహుజన సాహిత్య అకాడమీకి జాతీయ అధ్యక్షులుగా నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరుగుతుందన్నారు. పై అవార్డులకు దరఖాస్తు చేయదలచిన వారు 9440962670 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలన్నారు.