02-07-2025 07:42:41 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన రైతులు సోడే నారాయణ, సోడే రాకేష్ ల ఇద్దరివి దుక్కిటెద్దులు అని గ్రామస్తులు తెలిపారు. ఒక దుక్కిటి ఎద్దు. రూ. 60 వేలు మరొకరిది ఆవు దూడ రూ. 20.వేల విలువగల పశువులు చిట్యాల గ్రామంలో గల బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కు గల పెన్సింగ్ కు విద్యుత్ షాక్ సర్క్యూట్ అవడం వలన మూగ జీవాలు మరణించడం జరిగింది. కాగ దుక్కిటి ఎద్దు మృత్యువాత పడగా వ్యవసాయం చేసుకుని బతికి మా కుటుంబాన్ని పోషించుకునేది. ఇప్పుడు ఆ వ్యవసాయం భారమైందని బోరున విలపించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి ఆర్థిక సహాయం అందించగలరని ఆవేదన వ్యక్తం చేశారు.