calender_icon.png 24 January, 2026 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొయినాబాద్‌లో ప్రవేశాలు షురూ..

24-01-2026 12:28:22 AM

5వ తరగతి నుంచి ఇంటర్ వరకు దరఖాస్తుల ఆహ్వానం

మొయినాబాద్,జనవరి 23 (విజయక్రాంతి): మొయినాబాద్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల (TGMRS)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ డి. రజినిదీపా ఈ వివరాలను వెల్లడించారు. 5వ తరగతి (ప్రధాన ప్రవేశాలు) మరియు 7 నుంచి 12వ తరగతి వరకు (మిగిలి ఉన్న ఖాళీ సీట్లు). దరఖాస్తు గడువు: జనవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

5వ తరగతి లో మొత్తం 80 సీట్లు ఉండగా60 మైనారిటీలకు, 20 ఇతరులకు కేటాయిస్తారు.రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, డిజిటల్ క్లాస్రూములు. ఆధునిక ల్యాబ్స్, లైబ్రరీ వసతులు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వ్బుసైట్ tgmreistelangana.cgg.gov.in సందర్శించవచ్చు లేదా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు: 7995057961, 9398257337.