calender_icon.png 24 January, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ

24-01-2026 12:28:22 AM

మరిపెడ, జనవరి 23 (విజయక్రాంతి): మరిపెడ మండలం గాలి వారి గూడెం గ్రామ మండల ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో 35 మంది స్కూలు పిల్లలకు సుమారు 12 వేల విలువగల బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులందరూ పేద పిల్లలు కావడంతో వారికి సరైన యూనిఫామ్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు.

వైట్ యూనిఫామ్, వైట్ షూస్ సాక్స్ లు స్పాన్సర్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నారెడ్డి శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ బల్లెం ఎల్లయ్య, వార్డ్ సభ్యులు ఏడెల్లి వెంకన్న, గ్రామ పెద్దలు చలమళ్ళ వెంకన్న, శవగాని ఉపేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంపల్లి వెంకన్న, స్కూల్ టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.