24-01-2026 12:29:30 AM
హనుమకొండ,జనవరి 23(విజయ క్రాంతి): రంగశాయిపేటలో బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో మిన్నంటాయి. నెహ్రూ కూడలి వద్ద రంగశాయిపేట యువజన సేన, ఉత్సవ సంఘం, రామాలయం వద్ద కొల్లూరి రిషినంద్ సేవా సంస్థ, శ్రీరామ భజన మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల వేడుకల్లో భాగంగా శుక్రవారం సంప్రదాయం ప్రకారం శాలివాహన కులస్తులు తొలి బోనాన్ని సమర్పించారు.
డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా వచ్చి దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు నెత్తిన పెట్టుకొని వచ్చిన భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆవునూరి రవి, కుమారస్వామి, లక్ష్మి, కందికొండ మోహన్, సుధాకర్, రమేష్, కుమార్, భిక్షపతి, శ్రీనివాస్, కృష్ణ, రాజు, మల్లేశం, రాజన్న, వెంకటేశం, దేవేందర్, సురే ష్, హరీష్, వంశీ, వీరేశం,ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.