15-05-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 14(విజయ క్రాంతి): భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం లో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం పెంచికల్పేట మండ లం బొంబాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సును సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో నూతన ఆర్‌ఓఆర్‌లో పొందుపరిచిన అంశాలపై అధికారులు, రైతులు అవగాహన కలిగి ఉండాలని తెలిపా రు. పెంచికల్‌పేటను పైలెట్ మండలంగా ఎంపిక చేసుకొని గత 12 రోజుల నుండి మండలంలోని వివిధ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులలో రైతులు తమ సమస్యలను నిర్ణీత నమూనా ఫారంలో నింపి అందజేస్తున్నారని తెలిపారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణతో రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టంలోని అంశాలకు లోబడి ఆరోపణలకు తావు లేకుండా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. అనంతరం ఎల్కపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల సమస్యలను తెలుసుకుని అధికారులకు పలు సూచ నలు చేశారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను డెస్క్‌వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తులు గల వివరాలను సరిచూసి క్షేత్రస్థాయి పరిశీలించాలన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు వెంకటేశ్వర్ రావు, కవిత, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.