calender_icon.png 16 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

16-09-2025 12:54:14 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం అసిఫాబాద్, సెప్టెంబర్ ౧౫ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకఓటేష్ ధోత్రే అన్నారు. సోమవారం  కలెక్టరేట్ లో  అదనపు కలెక్టర్  దీపక్ తివారి,ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన చాపిడి మీరాబాయి తనకు జారీ చేసిన పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబర్ సరి చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

ఆసిఫాబాద్ మండలం దస్నాపూ ర్ గ్రామానికి చెందిన  హెవీరే లక్ష్మి బాయ్ తనకు వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని కోరు తూ అర్జీ సమర్పించారు. బెజ్జూర్ మండలం సనుగుపల్లి చెందిన దేవి కమల తన భర్త చనిపోయాడని, తనకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కనక లక్ష్మి తాము ఉపాధి పనులు చేశామని, సంబంధించిన కూలి డబ్బులు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

వాంకిడి మండల కేంద్రానికి చెందిన సునీతా చౌదరి ఎస్. సి. వసతి గృహంలో వంటమనిషిగా పనిచేశానని, తనను ఉద్యోగంలోని తొలగించారని, తిరిగి తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. గడచరోలికి చెందిన పిడుగు సత్తయ్య తన తండ్రి గారి పేరున గల భూమిని తన పేరిట మార్చాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తక్కల్లపల్లి గ్రామానికి చెందిన బంక పోషం తన పట్టా పాసుపుస్తకం పోయిందని కొత్త పాసుపుస్తకం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన కమలాబాయి తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, జీవనోపాధికై ఏదైనా ఆశ్రమంలో పొరుగు సేవ పద్ధతిలో ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుం దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.