calender_icon.png 16 October, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్లికేషన్లు త్వరితగతిన పరిష్కారం చేయాలి

16-10-2025 07:59:34 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంలతో కలిసి హాజరయ్యారు. సీఈఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా వంద ఏళ్లకు పైబడిన ఓటర్ల జాబితాను వెరిఫై చేయాలని సూచించారు. ఎపిక్ కార్డ్స్, బీఎల్ వో ఐడి కార్డ్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి ఓట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.