16-10-2025 07:57:11 PM
ఎర్రవల్లి: గద్వాల జిల్లా కేంద్రంలో హరిత హోటల్ నందు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం అలాగే జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నియామకంపై సమావేశానికి విచ్చేసిన పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికారు. గద్వాల్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న క్రమంలో ఎర్రవల్లి చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి, ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కి నాయకులు పూలమాలలు వేసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అందెబోయిన వెంకటేష్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.