calender_icon.png 9 January, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

08-01-2026 12:00:00 AM

ప్రిన్సిపాల్ అరుణ 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జనవరి 7: 2026 - 27 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో 5 నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కొరకు ఈనెల 21 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జాజిరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎం అరుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇట్టి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య,భోజనం, వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు.