calender_icon.png 10 January, 2026 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెథెల్ ఒంటరి పోరాటం

08-01-2026 12:35:26 AM

ఓటమి తప్పించుకోవడం కష్టమే

సిడ్నీ టెస్టులో కంగారూల జోరు

119 రన్స్ ఆధిక్యంలో ఇంగ్లాండ్

సిడ్నీ, జనవరి 7 : యాషెస్ సిరీస్‌లో చివ రి టెస్ట్ ఫలితం ఆఖరి రోజునే తేలబోతోంది. నాలుగోరోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిన వేళ ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పేలా లేదు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగోరోజో జాకబ్ బెథెల్ ఒంటరి పోరాటం హైలైట్‌గా నిలిచింది. బెథె ల్ ఆదుకోకుంటే ఈ మ్యాచ్ బుధవారమే ముగిసిపోయేది. ఓవర్‌నైట్ స్కోరు 518/7 పరుగులతో నాలుగోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలి యా మరో 49 పరుగులు జోడించి ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 138(16 ఫోర్లు, 1 సిక్సర్)తో సత్తా చాటాడు. వెబ్‌స్టర్ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇం గ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కార్స్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. బెన్‌స్టోక్స్ 2, విల్ జాక్స్ , బెథెల్ చెరో వికెట్ పడగొట్టారు.

కాగా ఫీల్డింగ్ చేస్తుండగా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ గాయంతో మైదానాన్ని వీడాడు. తర్వాత రెండో ఇన్నిం గ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. క్రాలే (1), రూట్ (6), విల్ జాక్స్0), బెన్ స్టోక్స్(1) నిరాశపరిచారు. అయితే బెథెల్ ఒక్కడే ఆసీస్ బౌలర్లకు ధీటుగా నిలబడి ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు.  డకెట్(42)తో కలిసి 81 పరుగులు, బ్రూక్(42) కలిసి 102 పరుగులు జోడించాడు. నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు సాధించాడు.

అతనికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ లో ఇదే తొలి శతకం. దేశవాళీ క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా లేని బెథెల్ అంతర్జాతీయ క్రికెట్‌లోనే తన కెరీర్ తొలి శతకం సాధించి రికార్డులకెక్కాడు. దీంతో నాలుగోరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్లకు 302 పరుగులు చేసిం ది. బెథెల్ 142 నాటౌట్, పాట్స్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇం గ్లాండ్ 119 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. చివరిరోజు తొలి సెషన్‌లోనే ఆలౌట్ చేసి టార్గెట్ ఛేజ్ చేయాలని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బెథెల్ చివరిరోజు ఎంతవరకూ ఇంగ్లాండ్ స్కోరు ను తీసుకెళతాడో చూడాలి.