calender_icon.png 8 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రేయాస్ హిట్.. గిల్ ఫ్లాప్

07-01-2026 12:00:00 AM

  1. నిరాశపరిచిన జైస్వాల్, సూర్య
  2. పడిక్కల్ చేజారిన శతకం
  3. బంతితో రాణించిన దూబే, సిరాజ్
  4. విజయ్ హజారే ట్రోఫీ రౌండప్

జైపూర్, జనవరి 6: దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ మరోసారి స్టార్ ప్లేయర్స్‌లో కళకళలాడింది. బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్‌తో సీనియర్ ఆటగాళ్లందరూ చాలా కాలం తర్వాత ఈ టోర్నీలో ఆడారు. గత వారం కోహ్లీ, రోహిత్ శర్మ మెరిస్తే... ఈ వారం శ్రేయాస్ అయ్యర్, గిల్, సూర్యకుమార్, దూబే, జైస్వాల్ , పంత్ వంటి స్టార్స్ అందరూ సందడి చేశా రు. అయితే రీఎంట్రీలో శ్రేయాస్ అయ్యర్ దుమ్మురేపాడు. జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ముంబై జట్టుకు సారథ్యం వహించాడు.

నాలుగో ప్లేస్ లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ టీ20 తరహాలో హిట్టింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 53 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 రన్స్ చేశాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఆసీస్ టూర్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. గత కొంతకాలంగా విశ్రాంతికే పరిమితమై ఇటీవలే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు.

కివీస్ తో వన్డే సిరీస్‌కు ఎంపికైన ప్పటకీ ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే క్లియరెన్స్ ఇస్తామని సీవోఈ తెలిపింది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన శ్రేయాస్ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆడాడు. దీంతో కివీస్‌తో సిరీస్‌లో ఆడడం దాదాపు ఖాయమైనట్టే. జనవరి 8న పంజాబ్‌పైనా శ్రేయాస్ ఆడనున్నాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 33 ఓవర్లకు కుదించగా.. ముంబై 299 పరుగుల భారీస్కోర్ సాధించింది. మరో బ్యాటర్ ముషీర్ ఖాన్ కూాడా హాఫ్ సెంచరీతో రాణించాడు.

అయితే జైశ్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్(21), సూర్యకుమార్ యాదవ్ (24) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ కూడా చివరి వరకూ పోరాడింది. ఫుక్రజ్ మన్(64), అంకుశ్ బైన్స్ (53) మయాంక్ దగార్ (64) హాఫ్ సెంచరీలతో పోరాడారు. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉండగా శివమ్ దూబే 2 వికెట్లు తీసి ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో దూబే బంతితో రాణించి 4 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు భారత కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం ఫ్లాప్ అయ్యాడు. గోవాతో మ్యాచ్ లో బరిలోకి దిగిన గిల్ నిరాశపరిచాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులకే వెనుదిరిగాడు. చివరిసారిగా ఆసీస్ టూర్ లో ఆడిన గిల్ మెడనొప్పితో సౌతాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. పేలవ ఫామ్ తో టీ20 ప్రపంచకప్ లో గిల్ కు చోటు దక్కలేదు. ఇప్పుడు కివీస్ తో వన్డే సిరీస్‌కు రీఎం ట్రీ ఇచ్చినా ఫెయిలవడం నిరాశకు గురి చేసిం ది. మిగిలిన స్టార్ క్రికెటర్లలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పర్వాలేదనిపించాడు.

రైల్వేస్‌తో మ్యాచ్ లో పంత్ 24(9 బంతుల్లో 3 సిక్సర్లు,1 ఫోర్) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రైల్వేస్ 179 పరుగులకే ఆలౌటవగా.. నవదీప్ శైని(3/30), ఆయుశ్ బదౌని(3/30) రాణించారు. ఛేజింగ్‌లో ఢిల్లీ ఓపెనర్లు ప్రియాన్శ్ ఆర్య 41 బంతుల్లోనే 80, రంజన్ (33) అదిరిపోయే ఆరంభాన్నివ్వగా.. నితీశ్ రాణా 38 నాటౌట్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. మరో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(9) ఫెయిలయ్యాడు. ఇషాన్ ఫెయిలయినా శిఖర్ మోహన్ సెంచరీతో మధ్యప్రదేశ్‌పై జార్ఖండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పడిక్కల్ మరో సెంచరీ మిస్ :

కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సూప ర్ ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే 5 మ్యాచ్‌లలో 4 శతకాలు చేసిన పడిక్క ల్ మరో సెంచరీని తృటిలో మిస్సయ్యాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 82 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 91 పరుగులకు ఔటై 9రన్స్ తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ పరుగులు 600 దాటాయి. దీంతో మూడు వేర్వేరు ఎడిషన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డులకె క్కాడు.

పడిక్కల్ తొలిసారి 2019-20 , 2020-21 సీజన్లలో 600 ప్లస్ పరుగుల రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 6 ఇన్నింగ్స్‌లు ఆడిన పడిక్కల్ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 605 పరుగులు చేశాడు. పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటకీ శ్రేయాస్ అయ్యర్ రీ ఎంట్రీతో అతనికి చోటు దక్కలేదు.