04-08-2025 10:07:19 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ మా ఫౌండేషన్ లో ఉంటున్న బాలుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రోడ్డుపై తిరుగుతున్న నలుగురు బాలురుని సిడబ్ల్యూసి వారు రెస్క్యూ చేసి పీర్జాదిగూడ మానసనగర్ లో మా ఫౌండేషన్ లో ఆశ్రమం కొరకు పెట్టడం జరిగింది. అందులో ఒక బాలుడు ఉప్పల్ కి చెందిన కె భరత్(10) ఈనెల 3న ఉదయం నుండి కనిపించడం లేదు. ఈ విషయంపై మా ఫౌండేషన్ నిర్వాహకులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్టి బాలుడు కనిపిస్తే మేడిపల్లి పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా సిఐ గోవింద రెడ్డి తెలిపారు.