calender_icon.png 5 August, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిడబ్ల్యూజేఏ మహాసభల కరపత్రం ఆవిష్కరణ

04-08-2025 10:09:16 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): గిరిజన జర్నలిస్టులు ఐక్యత అభినందనీయమని మరిపెడ మండల తాసిల్దార్ కృష్ణవేణి(Tahsildar Krishnaveni), మరిపెడ అగ్రికల్చర్ ఆఫీసర్ వీరాసింగ్ అన్నారు. ఈ నెల 8న మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (టియుడబ్ల్యూజేఏ) జిల్లా ద్వితీయ మహాసభ నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం మరిపెడ మండల తహసిల్దార్ కృష్ణవేణి, మండల వ్యవసాయ అధికారి వీరా సింగ్ మహాసభల కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా వెలికి తీసేది జర్నలిజం అన్నారు. ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ద్వితీయ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర గౌడ్, మరిపెడ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీ కుమార్, మరిపెడ మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బానోతు ప్రవీణ్ నాయక్, బోడ శ్రీను నాయక్ ,గుగులోతు రాజు నాయక్, హేమ నాయక్ తదితరులు పాల్గొన్నారు.