calender_icon.png 5 August, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

04-08-2025 10:05:11 PM

బెజ్జంకి: వందేళ్ళ సుదీర్ఘమైన చరిత్ర ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్(CPI Mandal Secretary Bonagiri Rupesh) అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడాలిలో సిపిఐ పార్టీ నాల్గవ రాష్ట్ర మహాసభ పోస్టర్లను మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోనగిరి రూపేష్ మాట్లాడుతూ... సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభలు 19 నుంచి 22వ తేదీ వరకు మేడ్చల్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, ఈ  మహాసభలకు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు విద్యార్థి యువజన కార్మిక కర్షకులు పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. వందేళ్ళ సుదీర్ఘమైన చరిత్ర ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, నాడు ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించి భారతదేశానికి స్వతంత్రం రావడానికి కృషి చేసిందన్నారు. 

పార్టీ పుట్టినప్పటి నుంచి పేదల కోసం సమాజంలో అంతరాలు లేని సమాజం కావాలని సంపద అందరికీ చెందాలని నిరంతరం పోరాటాలు చేసిందన్నారు దోపిడికి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరు సల్పి పేద ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలన్నారు. ప్రజలను విస్మరిస్తే పాలకవర్గాలకు సరైన బుద్ధి చెప్పడానికి పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాదని. కమ్యూనిస్టు పార్టీతో పుట్టిన చాలా పార్టీలు కాలగర్భంలో  కలిశాయన్నారు కానీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి  చేసుకుందన్నారు. సమాజంలో దోపిడీ ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ప్రజల కోసం సిద్ధంగా ఉంటుందన్నరు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహకార దర్శి సంగెం మధు పండుగ పరుశరాములు సిపిఐ గ్రామ సహాయ కార్యదర్శి దర్శి పొట్లపల్లి బాబు ఏవైఎఫ్ మండల కార్యదర్శి దొంతర వేణి మహేష్ సిపిఐ నాయకులు రోడ్డ చరణ్ కర్రవుల నరసయ్య రోడ్డు లక్ష్మణ్ బుర్ర లక్ష్మణ్ పాల్గొన్నారు.