calender_icon.png 4 September, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యంలో పురుగులు

04-09-2025 12:37:16 AM

హన్వాడ, సెప్టెంబర్ 3 : రేషన్ షాప్ లో నిరుపేదలకు అందించే బియ్యంలో పురుగులు కదులుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గ్రామంలోని రేషన్ దుకాణంలో సన్నబియ్యం ముక్కబట్టి పురుగులతో కూడిన సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఇదేంటని ప్రజలు రేషన్ డీలర్ ను ప్రశ్నించగా& ఇక్కడ రేషన్ కార్డు ఉన్నవారు బయట వారు నివసించే ప్రాంతాల్లో బియ్యం తీసుకుంటున్నారు .

అందుకోసం ఇక్కడ బియ్యం మిగిలిపోతున్నాయి.  3 నెలలకో సారి బియ్యం స్టాక్ అవుతున్నాయని, దీంతో బియ్యంలో పురుగులు వచ్చాయని రేషన్ డీలర్ తెలిపారు. సంబంధిత అధికారులు రేషన్ బియ్యాన్ని పురుగులు రాకుండా చూడాలని కోరుతున్నారు.

రేషన్ బియ్యం లో పురుగులు వస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించి పురుగులు లేని బియ్యాన్ని సరఫరా చేయవలసిన డీలర్ షాప్ నిర్వాహకులు ఇలా మూడు నెలల క్రితం బియ్యం వేయడంతో కొంతమంది లబ్ధిదారులు పోర్టబులిటీ అవకాశం కల్పించడంతో ఇతర ప్రాంతాల్లో బియ్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సాకుగా చెప్పి పురుగుల బియ్యాన్ని పేదలకు అందిస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులుకోరుతున్నారు.