calender_icon.png 26 November, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో రాజీపడొద్దు

26-11-2025 12:00:00 AM

  1. తెలంగాణ రైజింగ్-2025 నిర్వహణపై సీఎం సమీక్షలు 
  2. శాఖల వారీగా ఈ నెల 30 వరకు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, నవంబర్ 25  (విజయక్రాంతి) : వచ్చే డిసెంబర్‌లో 8, 9 తేదీల్లో నిర్వహించే  తెలంగాణ రైజింగ్ -2025 గ్లోబల్ సమ్మిట్  నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అందులో భాగంగా  నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుసగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

ప్రతి రోజు వేర్వేరు అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేయనున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహిం చిన సమీక్షలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేష్‌రంజన్, సందీప్‌కుమార్ సుల్తానీయా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ -2025 గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ఏర్పాట్ల విషయంలో ఎక్కడా కూడా రాజీపడొద్దని సీఎం సూచించారు.

సమీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా..

* నవంబర్ 26: లాజిస్టిక్స్ ఏర్పాట్లపై రివ్యూ

* పాల్గొనే వారు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ (సీతక్క), సంబంధిత అధికారులు

* నవంబర్ 27: మౌలిక వసతులు, అభివృద్ధిపై సమీక్ష 

* పాల్గొనే వారు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హె. వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు

* నవంబర్ 28: సాయంత్రం 4 గంటలకు  విద్య, యువజన సంక్షేమం  

* పాల్గొనే వారు: మంత్రులు వాకిటి శ్రీహరి, హె. వివేక్ వెంకటస్వామి, సంబంధిత అధికారులు సాయంత్రం 6 గంటలకు టూరిజం, టెంపుల్ టూరిజం

* పాల్గొనే వారు: మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సంబంధిత అధికారులు

* నవంబర్ 29: సాయంత్రం 4 గంటలకు  వ్యవసాయం, సంక్షేమ విభాగాలు 

* పాల్గొనే వారు: మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి సాయంత్రం 6 గంటలకు  మైనారిటీ, గిరిజన సంక్షేమం మొదలైనవి: 

* పాల్గొనే వారు: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దానం నాగేందర్ (సీతక్క)

* నవంబర్ 30: ఆరోగ్య రంగం 

* పాల్గొనే వారు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, సంబంధిత శాఖ అధికారులు