calender_icon.png 7 November, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడేళ్లయినా ఏడు చాపలమేరా?

07-11-2025 12:21:26 AM

  1. వినియోగంలోకి వచ్చేనా..? 10 లక్షల ప్రజాధనం వృధా..
  2. నామమాత్రంగానే శుభ్రం మత్స్యశాఖ పర్యవేక్షణ ఎక్కడ..? 
  3. చేపల మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్

గోపాలపేట నవంబర్ 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో చేపల వినియోగ కేంద్రం నిర్మించి ఏడేళ్లయినా ఏడు చేపలమే రా అంటూ ప్రజలు సిగ్గుపడుతున్నా వైనం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని హైదరాబాదు వెళ్లే రహదారిపై రంగు అంగులతో నిర్మించిన చేపల కేంద్రం దర్శనమిస్తున్న ఇస్తుం దండోయ్...

2018 సంవత్సరంలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి లతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు హంగు ఆర్భాటాలతో 10 లక్షలతో నిర్మించిన చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ఆ చేపల విక్రయ కేంద్రం ఊసే మరిచారు.

మత్స్యకారులు అక్కడ చేపల విక్రయాలు జరపకపోవడం పట్ల శిథిలావస్థకు చేరి చేపలు ఎక్కడ ఉంటాయో కానీ పందుల దొడ్డిగా మారింది. ఆ విక్రయ కేంద్రాన్ని చాలామార్లు పత్రికల్లో కథలుగా వచ్చాయి. మత్స్యకారులు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో అప్పటి ప్రభుత్వంలో మత్స్యశాఖ అభివృద్ధి పథకం కింద 2016-17 గాను 10 లక్షల నిధులచే చేపల విక్రయ కేంద్రాన్ని నిర్మించారే గాని నేటి వరకు అందులో విక్రయాలు జరపలేదు.

ఎప్పుడో ఓసారి మత్స్యకారులకు స్వప్నంలో గుర్తొచ్చినప్పుడల్లా చేపలు అమ్ముతారే తప్ప నిత్యం అక్కడ విక్రయాలు మాత్రం జరపడం లేదు. గత నెలలో జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించారు. గోపాలపేటలో 10 లక్షల తో నిర్మించిన చేపల విక్రయ కేంద్రం ఎలా ఉందని పరిశీలించారు. చెట్లు , శతారంతో పందుల దొడ్డిగా మారిందని అధికారులు అవక్కయ్యారు.

వెంటనే మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు మత్స్యకారులను పిలిపించి వెంటనే వీటన్నిటిని తొలగించి శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఇకనుంచి చేపలు ఇక్కడే విక్రయించాలని మత్స్యకారులకు అధికారులు తెలిపారు గోపాలపేట మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో చేపల విక్రయ కేంద్రాన్ని శుభ్రం చేయించి మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చారు.

కానీ నెల గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా మత్స్యకారులు చేపలను బస్టాండ్ లోనే విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. చేపల విక్రయ కేంద్రాన్ని ఈసారైనా మత్స్యకారులు వినియోగంలోకి తీసుకొస్తారా అంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రజాధనాన్ని వృధా కాకుండా చేపల విక్రయాలను జరిపి ప్రజలకు విక్రయించాలని మత్స్యశాఖ అధికారులు గట్టిగా చెప్పారు.

మార్కెట్లోనే చేపలను విక్రయించాలి.. కలెక్టర్ 

 చేపల మార్కెట్ను వినియోగం తెచ్చేందుకు ప్రతి బుధవారం చేపలను సంతలో విక్రయించకుండా ఈ చేపల మార్కెట్ లోని విక్రయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం వృధాగా ఉన్న చేపల మార్కెట్ను కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. ప్రజాధనం వృధా కాకుండా మత్స్యకారులు చేపలను పట్టుకొని మార్కెట్లోని విక్రయిస్తే చేపల మార్కెట్ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

అంతేకాకుండా మార్కెట్ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వెంటనే ఈ మార్కెట్ కు వాటర్ పైప్ లైన్ వేయించాలని కార్యదర్శికి కలెక్టర్ సూచించారు. మార్కెట్ను సందర్శించిన కలెక్టర్ ను మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బాలరాజు శాలువా కప్పి సన్మానించారు.