calender_icon.png 17 July, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు ఇక్కట్లు?

17-07-2025 12:00:00 AM

  1. మంజూరులో వేగం.. నిర్మాణంలో జాప్యం
  2. రోజు రోజుకు పెరుగుతున్న నిర్మాణ వ్యయం
  3. వ్యయ భారంతో లబ్ధిదారుల వెనుకడుగు

మణుగూరు, జులై 16, ( విజయ క్రాంతి ) : మండలంలో ఇందిర మ్మ ఇళ్ల మంజూరులో ఉన్న వేగం, నిర్మాణంలో కరువైంది. పలు పంచాయితీలలో ఇందిరమ్మ ఇంటి పనులు ఊపందుకోవడం లేదు. చేతిలో చిల్లి గవ్వలేని నిరుపేదలబ్ధిదారులు ముగ్గు పోసుకునేందుకు ముందుకు రావడం లేదు. గృ హ విస్తీర్ణాన్ని 600 చదరపు అడుగు లకు పరిమితం చేయడం కూడా ఈ పథకం ప్రగతికి ప్రతిబంధకమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వీటికి తోడు సిమెంట్, ఇటుక, స్టీలు వంటి వాటి ధరలు భారీగా పెరగడంతోలబ్ధిదారులు పనులు ప్రారంభించేందుకు వెనకాడుతున్నారు. ధరలు ఆకా శాన్నంటడంతో ప్రభుత్వ నిర్దేశిత వ్యయం లో ఇంటి నిర్మాణం పూర్తి కావడం కష్టమేన న్న అనుమానాలున్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు చెల్లిస్తున్న ప్పటికీ లబ్ధిదారులకు ఇంతకు రెట్టింపు స్థాయిలో ఖర్చుపెట్టాల్సి వస్తుందని, చెబుతున్నారు.

పెరిగిన ధరలే ప్రతి బంధకం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు ప్రస్తుత రోజుల్లో ఇంటి నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. సిమెంట్ ధర ఇప్పుడు సంచి రూ. 340కి చేరింది. ఒక్కో ఇటుక రూ.8 పలుకుతోంది. మేస్త్రీకి తక్కువలో తక్కువ రూ. లక్ష వరకు చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పోల్చుకుంటే నిర్మాణ వ్యయం భారీగా ఉంటోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

ఇది కూడా ఈ గృహాల నిర్మాణం నత్తనడకన సాగడానికి కారణమనే అభిప్రాయం ఉంది.మంజూరులో ఉన్న వేగం, నిర్మా ణం లో కరువుఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వనులు కొన్ని గ్రామాల్లో మాత్రమే చురుకుగా కొనసాగుతున్నాయి.మండలంలోని 14 పంచా య తీలకు మొదటి, రెండో విడతలో 407 ఇల్లులు మంజూరు చేయగా అందులో 332 ల బ్ధిదా రులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ ఇల్లులు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణ దశలో ఉన్నాయి. ఒకొక్క గ్రామానికి 20 నుంచి 30 ఇళ్ల మంజూరు కాగా, మేజర్ గ్రా మ పంచాయతీ సింగారంలో 80 ఇల్లులు, మున్సిపాలిటీ పరిధిలో 389 ఇల్లులు మంజూరయ్యాయి. 

కూలీల ఇసుక కొరత 

ఓవైపు.. పెరిగిన ధరలు మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అతలాకుతలం చే స్తున్నాయి. దీంతో ఇళ్ల మంజూరులో ఉన్న వేగం నిర్మా ణంలో కనిపిం చడం లేదు. మ రో వైపు ఆషాడం కూడా అడ్డంకిగా మా రింది.

పెట్టుబడి కొరత..

ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కొంత మొత్తంలో అయినా డబ్బు అవసరం. బే స్మెంట్ వరకు కట్టాలంటే కనీసం రూ. 1.50 లక్షలు ఖర్చవుతుంది. బేస్మెంట్ నిర్మా ణం పూర్తయ్యాకే రూ.1 లక్ష బిల్లు వస్తుంది. నిరుపేదలకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి పనులు ప్రారంభించడం కష్టమవుతోం ది. అప్పోసొప్పో చేసి నిర్మాణం ప్రారంభిద్దామనుకున్నా.. బిల్లులు వస్తాయో, రావోననే ఆందోళన చాలామందిలో ఉంది.

మొదటి విడతలో ఇళ్లు మంజూరైన చాలా మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టే స్థోమత లేక పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. మరికొంత మంది లబ్ధిదారులు తక్కువ విస్తీర్ణం నచ్చక ఇళ్లు కట్టేందు కు ఆసక్తి చూపడం లేదు. పునాదుల దశలో ఇచ్చే రూ. లక్షకు అదనంగా ఖర్చు కావడం తో చాలా మంది లబ్ధిదారులు వెను కడుగు వేస్తున్నారు.

దీంతో మండలం లోని ఆయా పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన కొన సాగుతున్నాయిఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ఇసుక, సిమెంట్, ఇటుక, ధరల ను అ దుపూలోకి తీసుకురా వలని, లేదంటే నిర్మాణంలోజాప్యం.. పథకం అమలుకు భారంగా మారుతుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వారికి వారం రోజుల్లో బిల్లులు వస్తాయని, ఇళ్లు మంజూరై ఇంకా నిర్మా ణాలు ప్రారంభించని వారు వెంటనే పనులు మొదలు పెట్టాలి. 

తేల్లూరి శ్రీనివాసరావు,  ఎంపీడీవో