calender_icon.png 18 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫారెస్ట్ గ్రౌండ్‌ను మున్సిపాలిటీకి అప్పగించండి

17-07-2025 10:08:57 PM

ఇల్లందు,(విజయక్రాంతి): పట్టణంలోని ఫారెస్ట్ గ్రౌండ్‌ను మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాల నిర్మాణం కోసం కేటాయించడాన్ని రద్దు చేసి, ఆ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చి ఇల్లందు మున్సిపాలిటీకి అప్పగించాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ గురువారం తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కు వినతిపత్రం అందజేశారు. ఇల్లందు మున్సిపల్ కోర్టుకు సమీపంలో ఉన్న ఫారెస్ట్ గ్రౌండ్‌ను గతంలో క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ట్రాక్ వంటి వివిధ క్రీడలలో శిక్షణ కోసం అథ్లెట్లు ఉపయోగించేవారని, దసరా జమ్మి పూజకు సాంప్రదాయకంగా ఉపయోగించే ప్రక్కనే ఉన్న జమ్మి మైదానాన్ని చర్చి నిర్మాణం కోసం సిఎస్ఐ చర్చినీ నిర్మించారన్నారు.

కొత్త కోర్టు భవనాల కోసం ఫారెస్ట్ గ్రౌండ్ కేటాయించబడినప్పటికీ, అదనపు కోర్టును తర్వాత రద్దు చేశారని, ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం సరిపోతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటాయించిన క్రీడా మైదానం గత 4 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతర నివాసితుల ప్రయోజనం కోసం ఫారెస్ట్ గ్రౌండ్‌ను క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇల్లందు పట్టణంలోని 8500 ఇండ్ల కు 76 జీవో ద్వారా ఇండ్ల పట్టాలని ఇప్పించాలని, జెకె 5 ఓసి ప్రాంతాన్ని మున్సిపాలిటీకి అప్పగించాలని మంత్రికి తెలియజేశారు.