17-07-2025 10:00:48 PM
మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ వారు నిరుద్యోగ మైనారిటీ యువతకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్విస్, ఇన్స్యూరెన్స్ రంగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి పథకానికి అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో కోరారు.
డిగ్రీ లేదా పిజీలలో 50 శాతం మార్కుల అర్హత కలిగి ఉండి, 26 సంల లోపు వయస్సు కలిగి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు కలిగి ఉన్నవారు ఈ యొక్క పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల ముస్లీం, క్రైస్తవులు, సిక్కులు, జైన్, పార్శీలు, భౌద్ద అభ్యర్థులు ఆగస్ట్ 18 లోపు తమ దరఖాస్తులను హైద్రాబాద్ మైనారిటీ సర్కిల్ కార్యాలయంలో లేదా జిల్లాలలో గల మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 8520860785, 040 23236112 లలో సంప్రదించాలన్నారు.