02-08-2025 02:11:38 AM
డిచ్పల్లి ఆగస్టు 1: (విజయ క్రాంతి ): నిజామాబాద్ జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి గ్రామీణ ప్రాంత శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి ప్రస్తావించగా వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఓ విభాగంలో ఏర్పాటు కు ఆదేశాలిస్తూ ఆ వెనువెంటనే జీవో విడుదల చేయడం హర్షణీయ అంశమని డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూరపాటి గంగాధర అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్, అన్ని గ్రామాల కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించడం హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్, రేకులపల్లి భూపతి రెడ్డి నిజాంబాద్ గ్రామీణ ప్రాంతాల్లో 18 నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని,, అలాగే భూమి పూజ శంకుస్థాపనలు మరెన్నో చేశారని పేర్కొన్నారు. 18 నెలల్లో గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో చెప్పిన పథకాల కన్నా ఆరు పథకాల కంటే ఎక్కువ 10 పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టిందని చెప్పారు.
ఈ సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పేద ప్రజలను విస్మరించి రేషన్ కార్డులు సైతం అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇచ్చిన హామీల్లో రేషన్ కార్డులు వివిధ పథకాలు 10 పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృషి చేస్తారని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే భూపతి రెడ్డికి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడు కు నిజాంబాద్ జిల్లా తరఫు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల నుండి అందరి తరపున విజ్ఞప్తి తో పాటు శుభాభివందనాలు తెలిపారు. సాంసంగ్, ధర్మారం వాసు, సు రామాలయ చైర్మన్ శాంతయ్య, ధర్మ గౌడ్, నవీన్,, సిహెచ్ వినయ్, లక్ష్మి, దేవకరణ, అశోక్, ఆర్.ఎం.పి ఘన్పూర్ లింబాద్రి, సుందర్, నీరడి దేవరాజ్, ఎజి దాస్, తో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి హాజరయ్యారు.