calender_icon.png 26 August, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా

26-08-2025 01:37:30 AM

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నాయకులకు మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ 

మంచిర్యాల, ఆగస్టు 25 (విజయక్రాంతి) : తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశానని, కానీ కొందరు అది జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమా అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వారికి సవాల్ విసిరారు.

సోమవారం తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లేనటువంటి మంచిర్యాలలో 400 మెగావాట్ల సబ్ స్టేషన్, లక్షెట్టిపేట్ లో 220 మెగా వాట్లా సబ్ స్టేషన్ ను, నస్పూర్ లో 130 మెగా వాట్లా సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయన్నారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే నాపై కొందరు నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని ఘాటుగా విమర్శిం చారు. బతుకమ్మ కానుకగా మహిళలకు శ్రీ శక్తి భవనం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు.. మంచిర్యాల జిల్లాకు త్వరలోనే పలు స్కూల్ మంజూరు అవుతుందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాం గ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.