calender_icon.png 6 December, 2024 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకేచోట పనిచేస్తున్నారా..?

05-11-2024 12:00:00 AM

ఈరోజుల్లో చాలా జంటలు ఒకే ఆఫీసులో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. కానీ కొన్నిసార్లు ఆఫీసు ఒత్తిడి వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు జంటలు ఏం చేయాలంటే.. ఆఫీస్ ఒత్తిడి ఇంటికి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది  ఆఫీ ఒత్తిడిని ఇంటికి తీసుకువస్తుంటారు. ఇది భార్యాభర్తల మధ్య తగాదాలకు దారితీస్తుంది.

భాగస్వామితో వృత్తిపరమైన విషయాలను ముందుగానే మీరు ఒకరితో ఒకరు నిజాయితీగా చర్చించు కోవాలి. ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒకరి పనిలో ఒకరు సహకరిం చుకోవడం కూడా ముఖ్యం. అయితే వ్యక్తిగత సంబంధాలను కంపెనీలోకి తీసుకురాకుండా గుర్తుంచుకోవాలి. మీ భాగస్వామి తప్పు అని మీకు అనిపి స్తే తప్పును సరిదిద్దమని అడగండి.

అలాగే వ్యక్తిగత జీవితం కాపాడుకో వడం ముఖ్యం. పనితో పాటు, మీరు ఇతర కార్యకలాపాల కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. భాగస్వామికి ఇంట్లో కూడా సమయ మివ్వాలి. అయితే ఆఫీస్ బాధ్యతలు, ఇంటి పనులను వేరు వేరుగానే భావించాలి. అయినా సమస్యలొస్తే మానసిక నిపుణులను సంప్రదించి పరిష్కరించుకోవడం ఉత్తమం.