calender_icon.png 5 December, 2024 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలస్యంగా నిద్రపోతే..

05-11-2024 12:00:00 AM

రాత్రిళ్లు పదే పదే నిద్ర లేచేవాళ్లు ఎంద రో. మెరుగైన ఆరోగ్యానికి తగినంత నిద్ర అవసరం. తక్కువ నిద్ర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. అయితే నిజానికి రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య మెలకువ వస్తే కాలేయ వ్యాధికి సంకేతమని ఓ నివేదిక వెల్లడిం చింది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..

దీనిని వైద్య భాషలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది కాలేయంలో కొవ్వు కణాలు పేరుకుపోయే వ్యాధి. ఈ కారణం గా కాలేయం సరిగ్గా పనిచేయదు. విషపూరిత వ్యర్థాలు శరీరం లోపల పేరుకుపోతాయి. రాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య మళ్లీ మళ్లీ నిద్రకు ఆటంకం కలిగితే కాలేయ సమస్య ఉండవచ్చు. 

ఏం చేయాలంటే..

* పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు మాత్రమే ఆహారం తీసుకోండి

* ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినొద్దు.

* మీ బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

* శారీరకంగా చురుకుగా ఉండండి.

* కాలేయ పనితీరు పరీక్షను ఎప్పటికప్పుడు చేయించుకోండి