22-09-2025 01:35:34 AM
నిర్మల్ సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందు కు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు మేరకు సెప్టెంబర్ 21 నుం చి 30 వరకు జరిగే ఉత్సవాలకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు ఉత్సవాలను సుఖశాంతుల మధ్య జరుపుకునేలా తాగునీరు,
విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. సద్దుల బతుకమ్మ నాడు (సెప్టెంబర్ 30) నిమజ్జన ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీ సుకోవాలని అధికారులకు సూచనలు జారీచేశారు. బాసర నవరా త్రి ఉత్సవాలకు రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు భారీగా రాను న్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా యంత్రాంగం ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. బైంసా మున్సిపాలిటీకి సంబంధించిన పాత సమస్యలపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖండిస్తూ, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది.