22-09-2025 01:34:13 AM
అదిలాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): జాతీయ భాష హిందీని ప్రచారాల ద్వా రా విశ్వవ్యాప్తం చేసి మన రాజభాష హిందీ గౌరవాన్ని పెంపొందించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హిందీ ఉపాధ్యాయులు, హిందీ భాష ప్రేమికులు అంతా కలిసి పని చేద్దామని హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 16న జిల్లా స్థాయి హిందీ దినోత్సవ కార్యక్రమం విజయవం తం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హిందీ భాషా భారతదేశంలోనే కాకుండా అనేక ప్రపంచ దే శాలు హిందీలో తమ కార్యకలాపాలు చేస్తున్నాయని హిందీ పరిధిని పెంచడానికి జిల్లా లో ఉన్న హిందీ ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.
హిందీ భాషను విశ్వవ్యాప్తం చేయడానికి ఉమ్మడి జిల్లాలోని హిందీ ఉపాధ్యాయులంతా భాషా ప్రేమికులతో కలిసి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హిందీ భాష సేవాసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ద్రోణాలే, జిల్లా ఉపాధ్యక్షులు జావేద్ అలీ, అత్తం పవార్, జిల్లా కోశాధికారి చంద్రశేఖర్ అంబేకర్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి కుర్సంగె ఉద్దవ్ తదితరులు పాల్గొన్నారు.