calender_icon.png 9 May, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ వరల్డ్ రాక ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

09-05-2025 02:23:33 AM

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి, మే 8 (విజయ క్రాంతి):  ఈనెల 15వ తేదీన జిల్లాలో ప్రపంచ సుందరి మణులు పర్యటిస్తున్నందున సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.  రాష్ట్ర దేవాదాయ శాఖ సంచాలకులు, యాదగిరిగుట్ట కార్యనిర్వహణాధికారి వెంకట్రావు, డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని సమీక్షించారు.

తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆధ్యాత్మికతను సంతరించుకున్న యాదగిరిగుట్ట, ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామంగా యునెస్కో వారి గుర్తింపు పొందిన పోచంపల్లి లలో ఏర్పాట్లు పట్టిష్టంగా చేపట్టాలన్నారు. యాదగిరిగుట్ట ను  ఆర్చీలతో, స్వాగత తోరణాలు తో ఆయా మార్గాలను అందంగా తీర్చిదిద్దాలని విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. 

చేనేత వస్త్ర సాంప్రదాయానికి వేదికగా నిలిచిన పోచంపల్లి  సాంస్కృతికి సాంప్రదాయాలకు  పుట్టిల్లు అని, ఏమాత్రం లోటు రాకుండా ఏర్పాట్లు  చేపట్టాలన్నారు. ముందుగా మిస్ వరల్ పర్యటించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. పోలీస్ శాఖ అధికారులు మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు. పర్యవేక్షించాలి అన్నారు.

చేపడుతున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో వీడియోలో రూపంలో వాట్సాప్ ద్వారా తనకు పంపించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్ పి సి ఓ శోభారాణి, టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఏసీపీలు, జిల్లా అధికారులు, ఆలయ అధికారులు  మున్సిపల్ కమిషనర్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.