calender_icon.png 9 May, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ వనరులను అభివృద్ధి చేస్తాం

09-05-2025 02:24:05 AM

-వైద్యంపై ఏటా రూ.11,482 కోట్ల ఖర్చు

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

-ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటు: పొంగులేటి

-ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్: దామోదర 

-యువత ప్రపంచంతో పోటీ పడాలి: తుమ్మల

-రఘునాథపాలెంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (విజయక్రాం తి): మానవ వనరుల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

గురువారం ఖమ్మం అర్బన్ రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశా ల భవన నిర్మాణ పనులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో నూతనంగా ఎనిమిది కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేసుకొని భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గత ప్రభు త్వం పదేళ్లలో సంవత్సరానికి వైద్యంపై రూ. 5,959 కోట్లు ఖర్చు చేస్తే, తాము ఒక్క ఏడాదిలోనే (2024 రూ.11.482 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మొదటి దఫా రూ. 11,600 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల తో 58 యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులు చేపట్టామ అన్నా రు. రూ.22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని అన్నారు. 57 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని చెప్పారు.

రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. గిరిజన కు టుంబాలకు రూ.12,500 కోట్లతో ఇందిరా గిరిజన వికాసం పథకం కింద ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలకు సోలార్ పంప్‌సెట్లు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్లను అందిస్తున్నామన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, దుబారా ఖర్చులు చేయకుండా  ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని, ఉద్యోగస్తుల అవసరాలను కూడా ప్రభుత్వం భవిష్యత్తు లో తీరుస్తుందని డీప్యూటి సీఎం తెలిపా రు. ఖమ్మం జిల్లా ప్రజలకు సాగునీరు అందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తున్నామని చెప్పారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించి నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణ చేశామని అన్నారు. 

బకాయిలు చెల్లిస్తూ అభివృద్ధి: మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం నగరానికి మణిహారంగా ఉండే రింగ్‌రోడ్డు పక్కన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, చిన్న, చిన్న ఇబ్బందులు ఉన్నా స్థల సేకరణ చేసి వైద్య కళాశాల నిర్మాణం చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.1,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తూ వైద్య శాఖలో నూతన ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.

విద్యా, వైద్యానికి ప్రాధాన్యం: తుమ్మల

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యా, వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ప్రపంచంతో పోటీ పడే లా యువతను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో కూ డా నర్సింగ్ కళాశాల మం జూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు.

కార్యక్రమంలో సీపీ సునీల్ దత్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు నరేంద్ర కుమార్, టీజీ ఎంఐడీసీ ఎండీ ఫణిందర్‌రెడ్డి, ఖమ్మం మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ ఫాతి మా జోహారా, జడ్పీ సీఈవో దీక్షా రైనా, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బీ కళావతిబాయి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకుబ్ పాల్గొన్నారు. 

90 ట్రామాసెంటర్‌ల ఏర్పాటు: మంత్రి దామోదర

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జాతీయ, స్టేట్ రహదారులపై సుమారు 90 ట్రామాసెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బ్లాక్ స్పాట్ వద్ద ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెం టర్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నామని తెలిపారు.

వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలనే ఉద్దే శంతో ప్రపంచ బ్యాంకు మంజూరు చేసి న రూ.4,100 కోట్లతో రీజినల్ క్యాన్సర్ సెంటర్‌ను వరంగల్‌కు, ఆర్గన్ రిట్రివల్ సెంటర్ ఖమ్మం జిల్లాలకు మంజూరు చేయబోతున్నామన్నారు.

ఎన్‌సీడీ రోగు ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, దీనిని అరికట్టెందుకు ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ అందిస్తున్నామని చెప్పారు. ఖమ్మంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.