09-05-2025 02:21:32 AM
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు, మే 8: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ప్రాంత అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అనేక ఇబ్బందులలో పడ్డారని, మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఆయన పర్యటించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మాట్లాడారు.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు మండల కేంద్రానికి నాలుగు కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి ఎస్సీ కాలనీలో మురికి కాలువలను నిర్మించామన్నారు. ఉప ఎన్నికలలో గెలిచిన తర్వాత 570 కోట్లు నిధులను మంజూరు చేయించి గ్రామాలలో లింకు రోడ్లకు టెండర్లు పిలిపించి పనులు మొదలు పెడితే వాటిని చేయనీయకుండా అడ్డుపడ్డాడు.
నా హయాంలో ప్రారంభించిన క్యాంపు కార్యాలయాన్ని తొలగించడం నిరంకుశత్వం,మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించాను. ఇప్పుడు ఆ కార్యాలయంపై నా పేరు ఉన్న శిలాఫలకాన్ని తీసేసి, తన పేరుతో కొత్తదాన్ని పెట్టారు. ఇది సార్వత్రిక ప్రమాణాలకు వ్యతిరేకంగా, పూర్తిగా నిరంకుశంగా చేసిన పని,‘ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గబీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గుర్తుగా వేసిన శిలాఫలకాలను గ్రామాల్లో తొలగిస్తున్నారు. ఇది రాజకీయ కక్షసాధింపు తప్ప మరేమీ కాదు. ఈ చర్యలు ప్రజలే చూసి తీర్పు చెబుతారు,‘ అని వ్యాఖ్యానించారు.
నిరంకుశ పాలనకు నిదర్శనం : కూసుకుంట్ల
కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ఒక నిరంకుశ పాలనకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు ఉండడం సహజమని, వాటిని అణచివేయడమనేది ప్రజా హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు.పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకుండా, చట్టాన్ని పాటించే స్థిరస్థాయి వ్యవస్థగా ఉండాలి.
వాళ్లు అధికార పార్టీకి కాకుండా ప్రజలకు విధేయులుగా పనిచేయాలి.రాజగోపాల్ రెడ్డి అధికారాన్ని కమిషన్ల కోసమే ఉపయోగిస్తున్నాన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మందుల సత్యం, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, మాజీ ఎంపీటీసీ పొలగోని సైదులు,ఈద శరత్ బాబు, అయితగోని విజయ గౌడ్,మేకల శ్రీనివాస్ రెడ్డి,మాధగోని అంజయ్య గౌడ్, ఎడవల్లి సురేష్, వనం లింగయ్య పందుల సురేష్ ,దోటి కర్ణాకర్, సూర శంకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.