calender_icon.png 16 September, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

21-01-2025 06:14:21 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి సమావేశంలో మాట్లాడుతూ... ప్రగతి మైదానంలో ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఆన్నారు. స్టేజి ఏర్పాట్లతో పాటు విద్యాశాఖ ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్, నిరంతర విద్యుత్ తో పాటు త్రాగునీరు, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ ను అందుబాటులో ఉంచాలని అదేవిదంగా బారికేటింగ్ పటిష్టంగా చేపట్టాలని అలాగే ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్ వద్ద వచ్చే అతిధులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీస్ గౌరవందనం సమయాపాలన ఉండాలని సూచించారు. అదేవిదంగా అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.