calender_icon.png 22 January, 2026 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కరీంనగర్‌కు టీపీసీసీ అధ్యక్షుడి రాక

15-11-2024 12:41:29 AM

కరీంనగర్, నవంబరు 14 (విజయక్రాంతి): టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం కరీంనగర్‌లో పర్యటించనున్నా రు. ఇందిరా భవన్‌లో జరిగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృ తస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా కరీంనగర్‌కు వస్తుండటంతో నేతలు ఘన స్వాగతం పలికేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభు త్వం చేపట్టిన కులగణన కుటుంబ సమగ్ర సర్వే, రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతానికి వ్యూహ రచనపై సమగ్రంగా చర్చించనున్నారు.