calender_icon.png 12 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అరుణ్

12-12-2025 01:32:00 AM

రామప్ప డిఫెన్స్ కళాశాలకు దక్కిన గౌరవం

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): హనుమకొండ ములుగు రోడ్డులో గల రామప్ప డిఫెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పూర్తి చేసిన భూపాలపల్లికి చెందిన పెద్దల అరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ ఐలీ కర్ణాకర్‌గౌడ్ తెలి పారు. గత నెలలో జరిగిన ఇండియన్ ఎయి ర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు సెలక్షన్స్‌లో మొ దటి దశ ఆన్లైన్ రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, అనుకూలత పరీక్ష, వైద్య పరీక్షలో అర్హ త సాధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాడు. అరుణ్‌కు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది.

ఈ సందర్భంగా పెద్దాల అరుణ్ అభినందిస్తూ గతంలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌లో 12 మంది విద్యార్థులు ఎంపికైన విషయం గుర్తు చేస్తూ ఈ విజయం మిగతా విద్యార్థులకు ప్రేరణ కావాలని ఆకాంక్షించారు. కాగా గతంలో రామప్ప కళాశాల ద్వా రానే ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అరుణ్ సోదరి పెద్దాల అఖిల సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించి ఈ సంవత్సరంలోనే దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలాని నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఈ సం దర్భంగా కళాశాల డైరెక్టర్ తేజస్వి, వైస్ ప్రిన్సిపల్ తిరుపతి, ఫిజికల్ కోచ్ కమల్ అకాడమి క్ కోఆర్డినేటర్ వినోద్ జోనల్ మేనేజర్ పూర్ణచందర్ అభినందనలు తెలియజేశారు.