12-12-2025 01:33:27 AM
హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రచారం
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ‘ఎస్‌బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో’ ప్రచార కార్యక్రమంలో భా గంగా, ఎస్ రాధాకృష్ణన్, (చీఫ్ జనరల్ మేనేజర్) హైదరాబాద్ సర్కిల్, రవి కుమార్ వర్మ, (జనరల్ మేనేజర్), సతీష్ కుమార్, (జనరల్ మేనేజర్) లోకల్ హెడ్ ఆఫీస్, కోఠి, హైదరాబాద్ నుండి పబ్లిసిటీ వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సం దర్భంగా చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సర్కిల్ ఇప్పటివరకు ఆరు ఎక్స్‌పోలను విజయవంతంగా నిర్వహించిందని, ఈ సంప్రదాయా న్ని కొనసాగిస్తూ ఏడవ ఎడిషన్ ఎస్‌బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు హైదరాబాద్, హైటెక్స్, హాల్ నెం. 4లో జరగనుం దని తెలిపారు.
తెలంగాణ రాష్ర్టం 2047 నాటికి ?3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా స్థిరంగా పురోగమిస్తోందని, ఇది తెలంగాణ రై జింగ్ 2047 మరియు విక్సిత్ భారత్ 2047 యొక్క దూరదృష్టి లక్ష్యాలలో భాగమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సర్కిల్ తెలంగాణ రియల్ ఎస్టేట్ మరియు హౌసింగ్ ఫైనాన్స్ వ్యవస్థలో తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంటోంది.
ఇందుకోసం సరళీకృత మరియు వేగవంతమైన లోన్-మంజూరు వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ఈ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోలో దాదాపు 60 మందికి పైగా అటువంటి ప్రతిష్టాత్మక బిల్డర్ సంస్థలు పాల్గొంటున్నాయి. మూడు రోజుల ఈవెంట్‌లో 8వేల నుండి 10వేల మంది సందర్శకులు వస్తారన్నారు. దీనివల్ల బిల్డర్లకు గణనీయమైన బుకింగ్‌లు, ఆ లీడ్స్ మా బ్యాంకుకు వ్యాపారంగా మారతాయి. కస్టమర్‌లు కూడా బిల్డర్లు బ్యాంక్ అందించే ఆఫర్‌ల నుండి ప్రయోజనం పొందుతారు.