12-12-2025 01:34:46 AM
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఎస్‌బీఐ
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ), తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) భాగస్వామ్యంతో రెండు నెలల పాటు నిర్వహించబడే ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ అవగాహన ప్రచారాన్ని గురువారం తెలంగాణలోని ఎస్‌బీఐ ఆరు అడ్మి నిస్ట్రేటివ్, 27 రీజినల్ బిజినెస్ కార్యాలయా ల్లో ప్రారంభించింది. ఈ ప్రచారం 2025 డిసెంబర్ 2 నుంచి 2026 జనవరి 31 వ రకు నిర్వహిస్తారు.
ప్రతి టచ్ పాయింట్ వద్ద అవగాహనను పెంచడం ద్వారా కస్టమర్లను రక్షించాలనే తన లక్ష్యాన్ని ఎస్‌బీఐ పునరుద్ఘాటించింది. సర్కిల్ అంతటా 355 మంది శి క్షణ పొందిన సైబర్ డి ఫెండర్లను నియమించారు. వారు రోజుకు రెండుసార్లు శాఖలలో కస్టమర్లతో మాట్లాడతారు. సురక్షితమైన డి జిటల్ పద్ధతులను బలోపేతం చేయడానికి పాఠశాలలు, కళాశాలలు, ఆర్డబ్ల్యుఏలు, క మ్యూనిటీలలో ఔట్రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇమెయిల్ హెచ్చరికలు, పార్క్ కార్యకలాపాలు, మొబైల్ అవేర్‌నెస్ వ్యాన్‌లు, నుక్కడ్ నాటకాలు, కాలేజ్ కార్యక్రమాలు, టౌన్ హాల్ మీటింగ్‌ల ద్వారా లక్షలాది మంది పౌరులను చేరుకుంది. ఈ ఏడాది మాత్రమే వెయ్యి మందికి పైగా సి బ్బంది మాస్-అవేర్‌నెస్ డ్రైవ్‌లలో పాల్గొన్నారు. ఎస్‌బీఐ తన ‘ప్రతి ఒక్కరూ రోజుకు ఐదుగురిని చేరుకుని, ఐదుగురికి నేర్పండి’ అనే ఉద్యమాన్ని బలోపేతం చేస్తూనే ఉంది.