calender_icon.png 12 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఓటు చోరీ సంతకాల సేకరణ

12-12-2025 01:30:46 AM

  1. 10 లక్షలకు పైగా పార్టీ నేతల సంతకాలు
  2. ప్రతులను ఏఐసీసీ కార్యాలయానికి పంపిన పీసీసీ  

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మే రకు ‘ఓటు చోరీ’ కార్యక్రమం పేరుతో తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో సంతకాల సేకరణ విజయవంతంగా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, గ్రామ స్థాయిలో 10 లక్షలకు పైగా పార్టీ నేతలు సంతకాల సేకరణ చేశారు.

ఓ టు చోరీకి నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గు రువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి ట్రక్కుద్వారా పంపించింది. ఓటు చోరీపై ఈ నెల 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ముకు సంతకాల సే కరణ పత్రాలు అందజేసి ఎన్నికలు పారదర్శకంగా చూడాలని విజ్ఞప్తి చేయనున్నారు.