12-12-2025 01:29:11 AM
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం ఖమ్మంకు చెందిన 25 ఏళ్ల యువకుడిలో ఉన్న సంక్లిష్టమైన మెదడు క ణితిని విజయవంతంగా తొలగించింది. పరీక్షలలో అతనికి అకౌస్టిక్ ష్వాన్నోమా అనే నిర పాయకరమైన కానీ ప్రమాదకర కణితి ఉన్న ట్టు తేలింది. ఇది మెదడు కాండానికి దగ్గరగా ఉండడంతో, చికిత్స ఆలస్యమైతే ముఖ పక్షవాతం, శాశ్వత వినికిడి నష్టం, ఇంకా ప్రా ణా పాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉం టాయి.
హై-రిజల్యూషన్ ఎంఆర్‌ఐ ద్వారా సమస్యను ఖచ్చితంగా గుర్తించిన వైద్యబృం దం, కుడి రెట్రోమాస్టాయిడ్ సబ్‌ఆక్సిపిటల్ విధానంతో కణితిని పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. ఈ క్లిష్ట శస్త్రచికిత్సకు సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ భవానీ ప్రసా ద్ గంజి నాయకత్వం వహించగా, అనస్థీషియాలజీ క్రిటికల్ కేర్ హెఓడి డాక్టర్ ఎం. లక్ష్మీ ప్రశాంత్ కుమార్, ఓటీ, వార్డ్ బృందాలు సహకరించారన్నారు.శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమై, రోగికి కొత్త నాడీ సంబంధిత లోపాలు ఏవీ రాలేదు. అతను సమతుల్యతను తిరిగి పొందాడు, మూడు రోజుల్లోనే డి శ్చార్జ్ అయ్యాడు.
కేసు ప్రాముఖ్యతపై డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి, ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ ఎడ్ల మాట్లాడుతూ.. “చిన్నగా కనిపించే వినికిడి లోపం లేదా అసమతుల్యత కూడా లోపల పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు. ఈ రోగి సకాలంలో వచ్చాడు. అందువల్ల కణితిని పూర్తి గా తొలగించి, కీలకమైన మెదడు భాగాలను రక్షించగలిగాం” అన్నారు. “న్యూరో కేసుల్లో సమయానికి తీసుకునే నిర్ణయమే ప్రాణాలను కాపాడుతుంది. మా బృందం వేగవంతమైన ని ర్ధారణ, ఆధునిక వైద్యం, సమ న్వయంతో పనిచేయడంతో రోగికి మంచి ఫలితం వచ్చిందన్నారు.