22-11-2025 09:28:24 PM
గోపాలపేట: అరుంధతి అనే మహిళ మిస్సింగ్ అయిన సంఘటన ఏదుట్ల గ్రామంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన పల్లె అరుంధతి శుక్రవారం మిస్సింగ్ అయినట్లు భర్త మహేష్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. పల్లె అరుంధతి బోగాది మహేష్ తో 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా అరుంధతి వనపర్తి జిల్లాలోని ప్రజా వైద్యశాల పక్కనే ఉన్న ఓ హోటల్లో పనిచేస్తుంది.
అరుంధతి ప్రతిరోజు ఉదయం 7 గంటలకే ఏదుట్ల గ్రామం నుండి పనికి వెళుతుండేది. రోజులాగే శుక్రవారం రోజు కూడా ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి పనికి వెళ్తున్నానని బయలుదేరింది. రాత్రి అయినా తన భార్య అరుంధతి తిరిగి రాలేదని భర్త మహేష్ చుట్టుపక్కల తెలిసిన వారిని అంత గాలించాడు. ఎంతకీ అరుంధతి కనపడ కపోవడం పట్ల తన భార్య అరుంధతి కనబడటం లేదని గోపాలపేట పోలీస్ స్టేషన్లో భర్త మహేష్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.