calender_icon.png 22 November, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు చట్టాలపై అవగాహన తప్పనిసరి

22-11-2025 09:15:09 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): యువత తల్లిదండ్రులకే కాకుండా విద్యార్థులకు కూడా చట్టాలపై తప్పని సరిగా అవగాహన ఉండాలని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిట్టూరి రత్న పద్మావతి అన్నారు. శనివారం లీగల్ సర్వీసేస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కుమారులు, కుమార్తెలు వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రుల్ని పోషించడం చట్టపరమైన బాధ్యత అని తెలిపారు. తప్పులు చేసాక చట్టం గూర్చి తెలియదని చెప్పడం బాధ్యతరాహిత్యం అవుతుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని అటు తల్లిదండ్రులకు, ఇటు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావలని అన్నారు. పాఠశాలలో కీ. శే. రుద్ర బుచ్చిరాజం స్మారకార్ధం నిర్మించిన సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. చదువుల తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం మరచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.