calender_icon.png 22 November, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఎస్పీగా డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ బాధ్యతల స్వీకరణ

22-11-2025 09:26:18 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇటీవలి ఐపీఎస్ బదిలీల్లో భాగంగా 2015 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ పాటిల్‌ను నాగర్ కర్నూల్ జిల్లాకు ఎస్పీగా నియమించారు. ఇప్పటి వరకు ఆయన హైదరాబాద్ సీఐడీలో సేవలందించారు. రెండు సంవత్సరాలకు పైగా జిల్లా ఎస్పీగా పనిచేసిన గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్‌కు అధికార బాధ్యతలు అప్పగించారు.