22-11-2025 09:29:45 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అర్వపల్లి శివారులోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం ముగిశాయి. శుక్రవారం సాయంత్రం గంధం ఊరేగింపు జరగగా అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు హైదరాబాద్ డబుల్ పార్టీ వారిచే ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి దర్గాలో దీపారాధన(చిరాగ్) నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా లోపల, బయట భక్తులు వందలాది దీపాలను వెలిగించారు. దీపారాధన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్, స్థానిక ఎస్సై ఈట సైదులు, ముజవార్ సయ్యద్ ఆలీ, అబ్దుల్ హుస్సేన్, అంజద్, కర్కాని రమేష్, మున్నా, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.