13-08-2025 12:00:00 AM
కరీంనగర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): మాచిరాజు బాలసాహిత్య పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బడి పిల్లల కథల పోటీలలో ఆర్విన్ ట్రీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ వయసు విభాగాలలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే కథలు రాసి, న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు విజేతలకు నగదు బహుమతులు మరియు సర్టిఫికెట్లు ప్రదానం చేయబడినాయి.
S .ఆదిత్య 9వ తరగతి విద్యార్థికి 300/రూపాయల నగదు బహుమతి,సర్టిఫికెట్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బి.రమణారావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు చిన్నారుల్లో సృజనాత్మకతను, రచనా ప్రతిభను వెలికి తీస్తాయని,సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుతాయని పేర్కొన్నారు.