calender_icon.png 17 August, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ విద్యార్థినులకు సమస్యలు తలెత్తకుండా చూడాలి

13-08-2025 12:00:00 AM

  1. కేజీబీవీ సందర్శనలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ 

‘విజయక్రాంతి’ కథనానికి స్పందన

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు 12: మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినిలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. ’బాలికా విద్యాలయం.. దారంతా జలమయం...’ అనే విజయ క్రాంతి కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించి మంగళవారం కేజీబీవీని సందర్శించారు.

ఈ సందర్భంగా కేజీబీవీ, ఎల్లమ్మ కుంట చెరువు నుండి నకిరేకల్ రోడ్డు వరకు కలియ తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎల్లమ్మ కుంట చెరువులో నీరు పొంగి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలోకి చేరుతుందని, ఎల్లమ్మ కుంట చెరువు నుండి వచ్చే వరద నీరు నకిరేకల్ రోడ్డులోని తీగల చెరువు మరియు బతుకమ్మ కుంటకు అనుసంధానం చేసి వరద నీరు ఆగకుండా చూడాలని ఇరిగేషన్, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం విద్యాలయ ఆవరణలో ఉన్న నీటిని బయటకు పంపించి శానిటేషన్ పనులు నిర్వహించి విద్యార్థినిలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, తహశీల్దార్ భాషాపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి, ఇరిగేషన్ ఏఈ హరిస్వరూప్, ఎస్‌ఐ సైదులు,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.