calender_icon.png 13 September, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ కారుపై 'దాడి'

18-01-2025 05:27:21 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election) నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Former Chief Minister Arvind Kejriwal) ఢిల్లీ నియోజక వర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేపట్టేందుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కాన్వాయ్ పై దాడి జరిగిందని, దాడి చేసింది భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) గుండాలేంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి భయంతో కేజ్రీవాల్ పై దాడి చేయడానికి బీజేపీ గూండాలను రప్పించిందని ఆప్ నేతలు తెలిపారు. ఆయనను ఢిల్లీలో ప్రచారం చేయానికుండా బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ(BJP candidate Parvesh Verma) గూండాలు ఇటుకలు, రాళ్లతో దాడి చేసి గాయపరచడానికి ప్రయత్నించారని నేతలు పేర్కొన్నారు. బీజేపీ దాడులకు కేజ్రీవాల్ భయపడరని, ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం ఇస్తారని ఆప్ హిందీలో రాసి సంఘటన వీడియో క్లిప్‌ను ఎక్స్ లో పోస్ట్ చేసింది.