calender_icon.png 23 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేల బంద్ విజయవంతం

23-12-2025 02:41:23 AM

మద్దతు తెలిపిన అఖిల పక్ష నేతలు

సోయా కొనుగోలు చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయింపు

బేల, డిసెంబర్ 22 (విజయక్రాంతి): బేల మార్కెట్ యార్డ్‌లో సోయా కొనుగోలు చేయాలని చేపట్టిన బేల బంద్ విజయవంతమైనది. సోమవారం ఉదయం నుండే స్వచ్చందంగా వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసివేశారు. రైతులు చేపట్టిన బంద్‌కు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, బీఆర్‌ఎస్ నేత లు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, తదితర నేతలు మద్దత్తు పలికారు. అనంతరం రైతులు, ఆయా పార్టీల నేతలు అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు.

రెండు గంటలు పాటు జాతీయ రహదా రిపై బైఠాయించి నిరసన తెలపడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీం తో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో డిప్యూటీ తాహసిల్దార్ వామన్ రైతు సమస్యలు అడిగి తెలుసుకుని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతనని హామీ ఇవ్వడంతో ధర్నాను  విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ.... అధిక వర్షాల వల్ల తడిసిన సోయా పం టలను కొనుగోలు చేయడానికి అధికారులు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోని చాలా ఇబ్బందులు పడాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పండిన పంటను ఎవరు కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇబ్బందులు గురిచేస్తుంటే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభు త్వం, ఉన్నతాధికారులు దిగివచ్చి పండిన సోయా పంటలను బేషరతుగా కొనుగోలు చే యాలన్నారు. పంటలు కొనుగోలు చేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్య మ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.