calender_icon.png 23 December, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ లెర్నింగ్ పుస్తకాల ఆవిష్కరణ

23-12-2025 02:40:06 AM

మంచిర్యాల టౌన్, డిసెంబర్ 22: ‘డిజిటల్ లెర్నింగ్ పైతాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్’ అం శంపైన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో, స్వీయ అభ్యాసనం చేసుకునే విధంగా స్కూల్ అసిస్టెంట్ బి రాజమౌళి రాసిన పుస్తకాన్ని డీఈఓ కార్యాలయంలో సోమ వారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలలో ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించే విధంగా ‘ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ పుస్తకాలను ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశపెట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పైతాన్ ప్రోగ్రాం లాంగ్వేజ్‌ని మరింత సులభతరం చేయాలని ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, డిస్టిక్ ప్లానింగ్ (ఐ సి టి అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్) కో ఆర్డినేటర్ భరత్, ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ జ, జెండర్ అండ్ ఈక్విటీ కో ఆర్డినేటర్ కె విజయలక్ష్మి, సీఎంఓఓ, చౌదరి, ఏసిజిఈ ఎస్ మల్లేష్, ఏఎస్‌సి రాజకుమార్ పాల్గొన్నారు.