23-12-2025 02:32:19 AM
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కృష్ణానది ప్రవహించేదే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అని, సరైన సమ యంలో ప్రాజెక్ట్‌లు కట్టకపోవడం వల్లే పాలమూరు జిల్లాకు ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. సోమవారం ఆత్మకూరులో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహ న్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. నిజాం కాలంలో ఉన్నటువంటి ప్రాజెక్టు లను ఉమ్మడి ఏపీ లో రద్దు చేశారని బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జూరాల కు నీటి కేటాయింపు జరిగిందని ఆరున్నర టీఎంసి లు మాత్రమే జూరాలలో ఉంటాయన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో పరిహారం ఇవ్వకుండా నాలుగేళ్లు ఆపారని తొమ్మిది టీ ఏం సి లు వాడుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉందన్నారు. జూరాల కింద సొంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింద న్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు రోజుకి అవసరమైన నీళ్ళు రెండు టీ ఏం సి లు అని జూరాల ను భారీ ఎత్తిపోతల కు రిసోర్స్‌గా వాడలేమని ఇది చాలాసార్లు చెప్పినం అయినా అర్థం కావట్లేదన్నారు. శ్రీశైలంలో అట్టడుగున నీళ్ళు వాడుకునే విధంగా ఏపీ ప్రాజెక్టు లు నిర్మాణం చేపట్టిందని మనం అక్కడి నుండి నీళ్ళు తీసుకుం టాం అంటే వద్దు అంటారని ఆయన వివరించారు.
జూరాల మీద పాలమూరు రం గారెడ్డి పెట్టాలన్న ఆలోచన మూర్ఖమైనదన్నారు. సముద్రంలో కలిసే నీళ్ళు మనకు రావాలని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేశారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. నీళ్ళు ఆపాల్సింది పోయి.. చెక్ డ్యాంలు కూల్చివేస్తున్నారని సా గు, తాగు నీళ్లు అందించి ఈ ప్రాంతం కరు వు తీర్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ క్లుప్తంగా వివరించారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
సీఎం,మంత్రులకు జ్ఞానోదయం అవుతుందని అనుకున్నామని పాలమూరు బిడ్డ అని ఎన్నికల్లో 12 సీట్లు గెలిచారని రెం డేళ్ల కాలంలో పాలమూరు కి ఒరిగింది ఏంటి? రెండేళ్ల కాలం వృధా చేశారని లేకుం టే కరివెన వరకు నీళ్లు వచ్చేవని నీళ్ళు ఇద్దామనే చిత్తశుద్ధి లేదని ఎందుకు ప్రాజెక్టు ఆ పారు అనే దానికి సమాధానం లేదన్నారు.