calender_icon.png 23 December, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త హత్య కేసులో భార్య అరెస్ట్

23-12-2025 02:29:32 AM

  1. సహకరించిన మరో ఇద్దరు కటకటాలపాలు
  2. వివాహేతర సంబంధమే కారణం 
  3. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ

మేడ్చల్, డిసెంబర్ 22(విజయ క్రాంతి): వివాహేతర సంబంధం మోజులో భర్తని కడతేర్చింది ఓ మహిళ. తనకంటే 14 ఏళ్ల చిన్నవాడైనా యువకునితో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడు, మరో యువకునితో కలిసి భర్తను హతమార్చింది. హత్యలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. సుధీర్ బాబు కథనం ప్రకారం బోడుప్పల్ బృందావన్ కాలనీలో వీజే అశోక్ (45), జై పూర్ణిమ (36) దంపతులు నివసిస్తున్నారు.

అశోక్ శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్ గా పనిచేస్తుండగా, పూర్ణిమ అదే ప్రాంతంలో ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. పూర్ణిమకు అదే కాలానికి చెందిన కన్‌స్ట్రక్షన్ కార్మికుడు పాలేటి మహేష్ (22) తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై  భర్త అశోక్ ప్రశ్నించారు. దీంతో ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేయాలని పథకం వేసింది. ఈనెల 11న భర్త అశోక్ డ్యూటీ ముగించుకొని సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకోగానే మహేష్ అతని మిత్రుడు భూక్య సాయికుమార్ (22) దాడి చేసే గాయపరిచారు. అంతేగాక చిన్ని తో గొంతు నులిమారు.

భర్త కదలకుండా భార్య పూర్ణిమ రెండు కాళ్లు పట్టుకుంది. ఈనెల 12న తన భర్త బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయాడని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతదేహంపై గాయాలు ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. భార్యను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో పూర్ణిమ, మహేష్, భూక్య సాయి లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.