23-12-2025 02:15:19 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౨: రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టించింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2024- -25 ఆర్థిక సం వత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల మొత్తం విరాళాల్లో దాదాపు 82 శాతం నిధులు.. అంటే అక్షరాలా రూ.3,112 కోట్లను బీజేపీనే సొం తం చేసుకుంది. ఒక్క ‘ప్రూడెంట్’ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచే బీజేపీకి రూ.2,180 కోట్ల విరాళాలు అందడం గమనార్హం. అలాగే టాటా గ్రూప్ ‘ప్రోగ్రెసివ్ ట్రస్ట్’, మహీంద్రా గ్రూప్ ‘న్యూ డెమోక్రటిక్ ట్రస్ట్’కు సంబంధించిన సింహభాగం విరాళాలూ నుంచీ కూడా బీజే పీ ఖాతాలో జమ కావడం విశేషం.
సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన తర్వా త, కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ ట్రస్టుల వైపు మొగ్గు చూపాయి. దీంతో ట్రస్టుల ద్వారా అందిన నిధులు గతేడాదితో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు పెరిగి.. రూ.3,811 కోట్లకు చేరుకున్నాయి. ఈ విరాళాల్లో ఒక్క బీజేపీనే రూ.3,112 కోట్లు సొంతం చేసుకోవడం విశేషం. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పా ర్టీ ఖాతాలో ఈసారి విరాళాలు తక్కువగానే జమయ్యాయి. ఆ పార్టీ రూ.298.77 కోట్ల మేర విరాళాలు అందాయి.
ఈ రెండు పార్టీ లు కాక, మిగతా రాజకీయ పార్టీలన్నీ కలిపి సుమారు రూ.400 కోట్ల మేర విరాళాలు పొందాయి. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల విషయానికొస్తే.. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ రూ.15 కోట్ల మేర విరాళాలు పొం దింది. ఏపీలోని వైఎస్సార్ సీపీ సుమారు రూ.140 కోట్ల విరాళాలు పొంది అగ్రస్థానంలో ఉంది. టీడీపీ రూ.౮౩ కోట్లు, జనసేన రూ.25 కోట్ల విరాళాలు పొందాయి.